హైదరాబాద్ మెట్రోలో కీలకఘట్టం ఆవిష్కృతమైంది. నగరంలో రెండు ప్రధాన బస్‌స్టేషన్లు.. జూబ్లీబస్‌స్టేషన్- మహాత్మాగాంధీ బస్‌స్టేషన్ల మధ్య 11 కిలోమీటర్ల మెట్రోమార్గం అందుబాటులోకి వచ్చింది. దీంతో ఢిల్లీ తర్వాత రెండవ అతిపెద్ద మెట్రోగా హైదరాబాద్ మెట్రో రైలు కొత్త చరిత్ర సృష్టించింది. కారిడార్-2 (జేబీఎస్- ఫలక్‌నుమా)లో భాగంగా నిర్మించిన మార్గాన్ని శుక్రవారం ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావు ప్రారంభించారు.